Nenu Local Movie: నేను లోకల్ సినిమా మొదట సాయి ధరమ్ తేజ్‌తో అనుకున్నాం: బెక్కం వేణు

Nenu Local Movie: ఎవరైనా ప్రయత్నం చేస్తే పని అవుతుందని నిర్మాత బెక్కం వేణు గోపాల్ అన్నారు. తాను ఇండస్ట్రీలో అందరితో పాటు రేస్‌లో లేకపోవడానికి అది కూడా కారణం అయ్యుండొచ్చని ఆయన చెప్పారు. మన మైండ్‌లో ఏదైతే టార్గెట్ ఉందో దాని కోసం ప్రయత్నం చేస్తే ఆ దారిలోనే వెళతామని ఆయన అన్నారు. అలా తాను ప్రయత్నం చేయలేదని ఆయన వివరించారు. ఒక అందరూ అనుకుంటున్నట్టు గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే తాను కూడా పెద్ద హీరోలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చి ఉండేదేమోనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చేయాలనుంది కానీ తానే చేయట్లేదని ఆయన చెప్పారు. ప్రతీ సారి అనుకోవడం మళ్లీ తెలియకుండా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లి అలా చేస్తున్నానేమోనని ఆయన తెలిపారు.

నేను లోకల్ సినిమాను మొదట్లో సాయి ధరమ్ తేజ్‌తో అనుకున్నామని వేణు గోపాల్ చెప్పారు. తాము అనుకున్న కథ వాళ్లకు నచ్చలేదని, సెట్ కాలేదని ఆయన అన్నారు. చేయాలని అందరం అనుకున్నాం కానీ సెట్ కాలేదని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆ కథను రాజు గారికి చెప్తే ఆయన నాని గారికి చెప్పమన్నారని ఆయన తెలిపారు. అలా నాని గారికి కూడా చెప్పానని, ఆయనకు ఆ స్టోరీ నచ్చడంతో అలా నేను లోకల్ సినిమాను తీశామని ఆయన వివరించారు.

ఇకపోతే సినిమా చూపిస్త మామా సినిమాలో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్‌గా అవికా గోర్‌ను ముందుగా అనుకోలేదని గోపాల్ తెలిపారు. మూవీ స్టార్ట్ చేశాక హీరోయిన్ విషయంలో మార్పులు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ముందు అనుకున్న ప్రకారం అయితే అవికా గోర్ హీరోయిన్ కాదని, కానీ కొన్ని చర్చల తర్వాత ఆమెను పెట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దాంతో ఆ సినిమా స్ట్రాంగ్‌గా వచ్చిందని ఆయన తెలిపారు.