World War : యుద్ధం మొదలైంది.. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా.?

World War : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బాంబుల మోత మోగుతోంది. యుద్ధ విమానాలు, వాటిని కూల్చేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఇలా పరిస్థితి భీతావహంగానే మారుతోంది. ఉక్రెయిన్ మీదకు రష్యా దాడి చేస్తోందన్నది ఓ చర్చ. కాదు కాదు, ఉక్రెయిన్, అమెరికా కనుసన్నల్లో రష్యా మీదకు ఎగబడుతోందన్నది మరో చర్చ.

ఎవరి గోల వారిదే. అంతిమంగా పోయేవి ప్రజల ప్రాణాలే. అయితే, రష్యా మాత్రం తాము ఉక్రెయిన్ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా బాధ్యతగా వ్యవహరించామనీ, ఉక్రెయిన్ వల్లనే ఈ యుద్ధం సంభవిస్తోందని చెబుతోంది.

ఉక్రెయిన్‌కి సంబంధించి కీలక ఎయిర్ బేస్‌లను ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోపక్క, ఉక్రెయిన్‌కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతోంది. ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలూ రష్యాకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి.

ఒకప్పటి రష్యాలో భాగమైన ఉక్రెయిన్, ఇప్పుడు స్వతంత్ర దేశం. అయినాగానీ, ఆ ఉక్రెయిన్‌ని అమెరికా, రష్యా మీదకి ఉసిగొల్పుతోంది. అదే అసలు సమస్య. రష్యాకి మద్దతుగా చైనా నిలబడితే, అమెరికా గనుక రష్యాపై దాడికి దిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయం.

అయితే, అమెరికా మాత్రం తాము రష్యాపై దాడికి దిగబోమంటోంది. మరెందుకు, రష్యా పొరుగు దేశాల్లో అమెరికా తన బలగాల్ని, యుద్ధ విమానాల్ని మోహరిస్తున్నట్లు.? ఏదో జరుగుతోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా విజయం సాధించడం ఖాయం. విజయం సాధిస్తే ఆ తర్వాత, రష్యా సూపర్ పవర్ అవుతుందన్నది అమెరికా ఆందోళన.