బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట 24 గంటల పాటు ప్రసారం అయింది. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కోసం నిర్వాహకులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. ఇకపోతే ఈసారి కామన్ మాన్ ఎంట్రీ కూడా ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ కామన్ మ్యాన్ గా మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఇలా చేయాలి అంటూ నాగార్జున ఒక చిన్న వీడియోని విడుదల చేశారు .
ఇన్ని రోజుల పాటు మన ఇంటిలో కూర్చొని బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన వారికి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. అయితే ముందుగాటికెట్ టు బిగ్ బాస్ సీజన్ 6 అందుకోండి అని చెబుతూ మరిన్ని వివరాల కోసం స్టార్ మా వారి వెబ్ సైట్ లో కి లాగిన్ అవ్వాలిసిందిగా నాగార్జున తెలియజేశారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మీ పేరు, మీ జెండర్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఏ ఏ భాషలు మాట్లాడగలరు, మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా వ్యాపారం చేస్తున్నారా వంటి విషయాలను ఇంటి గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఇది పూర్తి చేసిన తర్వాత ఎమర్జెన్సీ నెంబర్ ఇచ్చి ఆ వ్యక్తి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని పూర్తి చేసిన తర్వాత మూడు నిమిషాల నిడివి గల ఒక ఆడిషన్ వీడియో సిద్ధం చేయాలి. ఆ మూడు నిమిషాల నిడివిగల వీడియో మూడు నిమిషాలు దాటినా, 50 ఎంబీ సైజు మించినా సరే పోటీలో అనర్హులుగా ప్రకటించనున్నారు.మరెందుకు ఆలస్యం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో పెళ్లి సందడి చేయాలనుకున్న వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.