రాజకీయాలంటే ఎప్పటికప్పుడు గళం వినిపించాల్సిందే. ఎంత సైలెంట్ గా రాజకీయాలు చేయాలనుకున్నా అన్నిసార్లు అది వర్కౌట్ కాదు. మౌన రాజకీయాలు చేయాలంటే ట్యాలెంట్ తో పాటు, వెనుక బలమైన సపోర్ట్ కూడా ఉండాలి. అది లేనప్పుడు నోటినే వాడితేనే వర్కౌట్ అవుతుంది. వైకాపాకు చెందిన ఓ మహిళా మంత్రి నోరు వాడటం లేదు. నియోజక అభివృద్ది పనులు చేయడం లేదంటూ తాజాగా ఆ నియోజక వర్గ ప్రజలు భగ్గుమన్నారు. ఆమె జగన్ మంత్రి వర్గంలో కొలువు దీరిన తానేటి వనిత. జగన్ కేబినేట్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరు నుంచి వనిత గెలిచారు. 2014లో కేఎస్ జవహార్ పై పోటి చేసిన వనితకు 2019 ఎన్నికల్లో వైకాపా తరుపు అనూహ్య విజయం దక్కింది.
టీడీపీ కంచుకోటైన కొవ్వురులో వనిత జయకేతనం ఎగరవేసి ఔరా అనిపించారు. ఇక వివాదాలకు దూరంగా…సెలైంట్ పొలిటీషన్ గా వనితకు మంచి పేరు కూడా ఉంది. అయితే జగన్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ నియోజక వర్గంలో ఎలాంటి పనులు జరిగాయని తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఆ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఏమేమి చెప్పారు? వంటి విషయాలు అన్ని సీఎం దృష్టికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిత దగ్గరకు వస్తే ఏడాది కాలంలో ఆమె ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని తేలింది. అలాగని ఆమె నియోజక అభివృద్ది పనులు ఏమైనా చేసారా అంటే? అదీ లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇసుక సహా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రేషన్ కార్డులు, ఇంకా ఆమె ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తానంటోన్న పేదల ఇళ్లు , ఫించన్ల విషయంలో కూడా తమ నియోజక వర్గంలో ఎవరికీ న్యాయం జరగలేదని స్థానికులు మండిపడుతున్నారు. మరి వీటన్నింపై వనిత వివరణ ఇవ్వాల్సిన అసవరం ఎంతైనా ఉంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవరించే ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని సీఎం ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.