Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ లైలా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా వేడుకలో భాగంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పరోక్షంగా వైసిపిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుపై ఒక్కసారిగా వైసీపీ ఫ్యాన్స్ దాడి చేస్తూ సినిమాని ఇబ్బందులలోకి నెట్టేశారు ఈ సినిమాని బాయికాట్ చేస్తాము అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ దాదాపు లక్షకు పైగా ట్వీట్లు వేయటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది.
ఇక ఈ సినిమా గురించి ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్న తరుణంలోనే విశ్వక్ ప్రెస్ మీట్ నిర్వహించారు అయితే ఈయన ప్రెస్ మీట్ నిర్వహించినప్పటికీ కేవలం 25 వేల ట్వీట్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ ఈయన పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు .అతనికి మాకు ఏమాత్రం సంబంధం లేదు ఆయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే చేశారు. అతను చేసిన మాటలకు మీరు బాధపడి ఉంటే క్షమాపణలు చెబితే మీ ఆవేశం తగ్గుతుంది అంటే నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ విశ్వక్ మాట్లాడారు.
ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డాము సర్ దయచేసి ఈ సినిమాని చంపేయొద్దండి అంటూ ఈయన వైసిపి అభిమానులను కోరారు. అయితే ఉన్నఫలంగా విశ్వక్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం లేకపోలేదని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక స్టార్ హీరో ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వటం వల్లే హీరో విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరినట్టు తెలుస్తోంది.
ఇలా హీరో విశ్వకు సలహా ఇచ్చిన హీరో మరెవరో కాదు ఎన్టీఆర్ అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ విశ్వక్ మధ్య చాలా మంచి రిలేషన్ ఉన్న నేపథ్యంలోనే సలహా ఇచ్చారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి ఇలాంటి టాక్ బయటకు రావడంతో వెంటనే ఎన్టీఆర్ విశ్వక్ ఫోన్ చేసి పోయి పోయి ఎందుకు వైసీపీ ఫాన్స్ తో పెట్టుకున్నారు.. వాళ్లు తలుచుకుంటే సినిమా ఇబ్బందులలో పడుతుంది అంటూ ఎన్టీఆర్ చెప్పడంతో వెంటనే విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.