మరొకసారి పెళ్లికి రెడీ అయిన విశాల్.. అమ్మాయి ఎవరో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి తెలుగు వాడైన విశాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటు తెలుగు, అటు తమిళ్ భాషలలో మంచి మాస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా ఉండగా గతంలో పెళ్లి పీటల వరకు వచ్చిన విశాల్ పెళ్లి ఆగిపోయింది. హైదరాబాద్ కి చెందిన అనీషా అల్లా అనే యువతితో 2019లో నిశ్చితార్థం చేసుకున్న విశాల్ అనూహ్యంగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేశారు. దీంతో ఆయన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని రోజులలో పెళ్లి పీటలు ఎక్కుతాడనుకున్న విశాల్ ఇలా నిశ్చితార్థం క్యాన్సిల్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే కొంతకాలం నుంచి కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలలో నిజం లేదని వారిద్దరూ మంచి స్నేహితులను వరలక్ష్మి శరత్ కుమార్ ఆ వార్తలకు చెక్ పెట్టింది. అప్పటినుండి ఈ వార్తల ప్రచారం ఆగిపోయింది. అనీషా అల్లాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత విశాల్ ఒంటరిగా గడుపుతూ సినిమా షూటింగ్ పనులతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం విశాల్ ‘లాఠీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ మరొకసారి తన పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాడు. పెళ్లి, ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “త్వరలోనే పెళ్లి చేసుకుంటాను..కానీ ఈసారి ఇంట్లో చూసినవారిని చేసుకోవాలనుకోవడంలేదు. ఎందుకంటే నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విశాల్ మాత్రం ఆ అమ్మాయి వివరాలు గురించి బయట పెట్టలేదు. దీంతో ఆ అమ్మాయి ఎవరో అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి విశాల్ కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని కాకుండా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడనున్నాడు.