విరాటపర్వం నక్సల్స్ సినిమా కాదు. స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం: సురేశ్ బాబు

ప్రస్తుతం ఇండస్ట్రీలో విరాట పర్వం సినిమా హాట్ టాపిక్ గా మారింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17వ తేదీ విడుదలై మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. 1990 లో సరళ అనే ఒక మహిళ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా రావన్న పాత్రలో నటించగా..సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ ప్రముఖులను కూడా బాగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలో విరాటపర్వం సినిమా యూనిట్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ..సురేష్ ప్రొడక్షన్ లో మొదటిసారిగా ఇలాంటి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా దర్శకుడు వేణు కథని అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో సాయి పల్లవి నటన చాలా అద్భుతంగా ఉంది. ఈ విరాటపర్వం సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాణ సంస్థలో మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని విరాట పర్వం సినిమా ఇచ్చింది.

1990 కాలంలో సరళ మహిళ జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఆమె జీవిత కథని సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నక్సలిజం సినిమా కాదు. ఇది ఒక స్వచ్చమైన ప్రేమకథ. ఈ ప్రేమ కథలో గొప్ప రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వున్నాయి. ఈ సినిమాలో ప్రతిదీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా నటించారు. ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని రానాని అడిగితే .. “ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారు ” అని చెప్పాడు. ఇలాంటి కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారు. విరాటపర్వం ఎపిక్ బ్లాక్ బాస్టర్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. విరాట పర్వం సినిమా టీం అంతటికి కంగ్రాట్స్ చెప్పారు.