విరాట పర్వం గ్రాండ్ ఈవెంట్ ఫిక్స్ చేసిన సినీ బృందం..

1990 నాటి నక్సలిజం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించాడు. ఇందులో ఆయన నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని గతంలో ప్రకటించగా వాయిదా పడటంతో మొత్తానికి ఈ నెల 17న విడుదల కానుంది.

ఇక ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఖరారు చేయగా.. ఈ వేడుకను కర్నూలులో నిర్వహించనున్నారు. ఇక దానికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మొత్తానికి నక్సలిజం నేపథ్యంలో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.