RRR Credit : వైరల్ – “RRR” క్రెడిట్ మాదే అంటూ పచ్చ మీడియా పైత్యం..!

RRR Credit : అసలు ఎక్కడా లేని క్రెడిట్స్ గోల అంతా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పాలి. ప్రతి పనికి కూడా కొంతమంది కొన్ని మీడియా వర్గాలు ముఖ్యంగా తామే అంతా చేసాం మొదట మేమే స్టార్ట్ చేసాం అందుకే ఈ పని అయ్యింది అంటూ క్రెడిట్స్ మాది అన్న రేంజ్ లో ఒకరి భారీ సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకునే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా అంటే ఏంటో కూడా అందరికీ తెలుసు. మరి ఓరోజు ఎప్పుడో ఒక నాలుగైదు సంవత్సరాల కితమో లేక అంతకు ముందో రాజమౌళి ఓ ఇంటర్వ్యూకి వెళ్లగా సదరు యాంకరు మల్టీ స్టారర్స్ పై ప్రశ్నలు వేశారు.
అందులో ఎన్టీఆర్, చరణ్ లతో ఓ సినిమా చెయ్యొచ్చు కదా అనేది జస్ట్ మాటల్లో మాటగా వచ్చింది.
కానీ దాని వల్లే ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చింది అని ఇప్పుడు వారు ప్రచారాలు చేసుకోవడం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనితో సాధారణ ఆడియెన్స్ కి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాక ఇదేం పైత్యం రా నాయనా అనుకుంటున్నారు.
అది ఈపాటికే చాలా మంది కూడా చూసి ఉండొచ్చు. మరి ఈ క్రెడిట్స్ అంటే వాళ్లకి ఎందుకు అంత పిచ్చో వారికే తెలియాలి.