అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. సిద్ధ‌మ‌వుతున్న మ‌నం 2 స్క్రిప్ట్‌!

సినీ ఇండస్ట్రీలోనే మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమాలు చాలా అరుదు. అలాంటి అందమైన కథతో.. అంతులేని ఆప్యాయతలతో నిండిన మనం సినిమాని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది అక్కినేని కుటుంబం.. దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలోనే కపూర్ ఫ్యామిలీ తర్వాత ఆ ఘనతను అక్కినేని ఫ్యామిలీ సొంతం చేసుకుంది. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగర్జున, చైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మనం సినిమా ఓ క్లాసిక్ గా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు తన సినీ కెరీర్ లో నటించిన ఆఖరి సినిమా కూడా అదే కావడంతో మరింత స్పెషల్ గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ త్వరలోనే మనం సీక్వెల్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అఖిల్ హీరోగా హలో సినిమాని డైరెక్ట్ చేశారు.

ప్రస్తుతం నాగ చైతన్య తో డిఫరెంట్ స్టోరీ మోడ్ లో థాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తున్న సమయంలో విక్రమ్ కుమార్ కు వినూత్న కథతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థాట్ వచ్చిందట. ఆ ఐడియానే హీరో నాగార్జునకు చెప్తే స్క్రిప్ట్ తో సహా రమ్మని చెప్పారట. అయితే ఇఫ్పుడు విక్రమ్ కుమార్ మనం 2 సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ ఓకే అయితే అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న నటీనటులంతా ఈ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

దీంతో పాటు ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్దం చేశారు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య లవ్ స్టోరీ ప్రమోషన్స్ తో పాటు థాంక్యూ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు మనం 2 స్క్రిప్ట్ రెడీ అయితే.. అక్కినేని అభిమానులకు పండగే.