Focus: ఫోకస్ సినిమా స్పెషల్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన విజయేంద్రప్రసాద్..?

Focus: బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి, విజయ్ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఫోకస్. ఈ సినిమాకు జి సూర్యతేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. దర్శకుడు తేజ తన డెబ్యూ మూవీ గా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ ఫోకస్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అషు రెడ్డి, విజయ్ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టీజర్ ను చూశాను. చాలా బాగుంది.. అందరూ ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చేయండి.అలాగే ఫోకస్ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపాడు రాజేంద్రప్రసాద్. ఇక తాజాగా విడుదల చేసిన స్పెషల్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.