Vijay Sai Reddy: 2029 ఎన్నికలు.. రీ ఎంట్రీ ఇవ్వనున్న సాయిరెడ్డి….పోస్ట్ వైరల్!

Vijay Sai Reddy: వైకాపా కీలక నాయకుడు విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు పూర్తిగా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసినదే. తాను ఇకపై ఎలాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహించనని ఏ పార్టీలోకి చేరబోను అంటూ ఈయన తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై తన జీవితం మొత్తం వ్యవసాయం చేస్తూ బ్రతుకుతానని తన రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఇలా రాజకీయాలకు దూరమవుతానని చెప్పిన విజయసాయిరెడ్డికి మాత్రం రాజకీయాలపై ఉన్న ఆసక్తి తగ్గలేదని చెప్పాలి. ఈయన రాజీనామా చేసినప్పటి నుంచి తరచూ సోషల్ మీడియా వేదికగా రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈయన చేసిన మరొక పోస్ట్ చూస్తే కనుక విజయ్ సాయి రెడ్డి 2029 ఎన్నికల నాటికి తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారని స్పష్టమవుతుంది.

తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ…వైసిపి పార్టీ సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకు తాజాగా రాజీనామా చేసినట్లు పేర్కొన్న విజయసాయిరెడ్డి… తన రాజీనామా పత్రాలను వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు విజయ సాయి రెడ్డి తెలిపారు. అదేవిధంగా 2029వ సంవత్సరంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అంటూ కూడా మనసులో మాట బయటపెట్టారు.

ఇలా ఈ పోస్టులో 2029 లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ ఈయన పోస్ట్ చేయడంతో వచ్చే ఎన్నికల నాటికి ఈయన తిరిగి పార్టీలోకి రాబోతున్నారని స్పష్టమవుతుంది. ప్రస్తుతం పలు కారణాలవల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటం కోసమే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్లు ప్రకటించారు కానీ ఈయన పరోక్ష రాజకీయాలలో పాల్గొంటారని ఈ పోస్టు ద్వారా స్పష్టమవుతుంది.