తాజాగా ఏపీలో పదో తరగతి పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అవ్వగా.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇది పదవ తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదని.. జగన్ రెడ్డి ప్రభుత్వ ఫెయిల్యూర్ అని విమర్శలు చేశారు. అంతేకాకుండా పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ లతో ప్రభుత్వం అభాసుపాలు అయిందని అన్నారు.
దీంతో ఈ వ్యాఖ్యల పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిల్ అయితే చర్యలు తీసుకుంటాము అని బెదిరించింది ఎవరు అంటూ లోకేష్ ను గట్టిగా ప్రశ్నించారు. పాస్ పర్సంటేజ్ ను పెంచడానికి ఏం చేశారో తెలియదా అని, ప్రశ్నాపత్రాలను లిఫ్ట్ చేయడానికి నారాయణ కారణమని అన్నారు. చదువు’కొన్న’ వాడివి రిజల్ట్ గురించి నీకు మాట్లాడే అర్హత లేదు అన్నట్లు వెటకారం చేశాడు.