టీడీపీలో కొత్త మంట పుట్టించిన చంద్రబాబు.. ఆ నిర్ణయంతో రగిలిపోతున్న సీనియర్లు.. ?

 

టీడీపీ అంటే ఒకప్పుడు ఆకాశంలో తారలా వెలిగిపోయింది.. కానీ ప్రస్తుత పరిస్దితుల్లో శిధిలావస్దలో ఉంది అనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.. ఇక జీవచ్చంగా మారిన పార్టీ తెలుగుదేశాన్ని బ్రతికించుకోవడానికి బాబు చేస్తున్న ప్రయత్నం అంటూ లేదు.. ఎన్ని ఉపాయాలను తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో గడించారో వాటన్నీంటిని ఇప్పుడు అమలు చేస్తున్నాడు.. చక్కెర కోసం చీమలు దారి పట్టినట్లుగా వైసీపీలోకి దారికట్టిన టీడీపీ నాయకులను బుజ్జగించో, ఆశపెట్టో దారిలోకి తెచ్చుకోవాలని ఎన్నో ప్లానులను అమలు చేస్తున్నాడు.. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. అదీగాక కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు బయటపడుతుండగా, మరి కొన్ని చోట్ల నేతల మధ్య వివాదాలు రేగుతున్నాయి. ఇలా ప్రస్తుతం ఈ నిప్పు విజయనగరం లో రాజుకుందట..

అసలు విషయం ఏంటంటే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం కిమిడి నాగార్జునను నియమించింది. కాగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, గజపతి నగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం మొదలైన అసెంబ్లీ సెగ్మంట్లు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి.. కాగా ఈ ఏడు నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నా వారిని కాదని నాగార్జునను ఎంపిక చేయడం చర్చాంశనీయంగా మారిందట.. ఈ విషయంలో మిగతా నాయకులు గుర్రుగా ఉన్నారట..

వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై చాలామంది బీసీ నేతలు గత కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత, కోళ్ల లలితకుమారి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి, బొబ్బిలి రాజవంశీకుడు, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన వంటి నేతల పేర్లు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తుండేవి. కానీ, ఆకస్మాత్తుగా నాగార్జున పేరు తెరపైకి రావడంతో సీనియర్లంతా కంగుతిన్నారట. అంతే కాకుండా జూనియర్‌కి అధ్యక్ష పదవి ఇచ్చి సీనియర్లను అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారట.. ఇక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా కూడా సమర్పించారట. ఇలా చంద్రబాబు నిర్ణయంతో రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి టీడీపీ నాయకుల్లో వ్యక్తం అవుతోందట..