ఇంకో పాతికేళ్ళు ఏడుస్తూనే ఉండండి…సెటైరికల్ కామెంట్స్..!

vijayasai reddy

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకి ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తెలంగాణ రాజకీయాలతో పోల్చి చూస్తే ఏపీ రాజకీయాలు చాలా గమ్మత్తుగా వుంటాయని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అధికారపక్షము, ప్రతిపక్షం ఎప్పటికప్పుడు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తూ, మీడియాకి మంచి మేత వేస్తూనే ఉంటాయి. ఏపీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్విట్టర్ రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఇద్దరు ట్విట్టర్ లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు, వాటికీ కౌంటర్ గా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇస్తుంటాడు.

vijayasai reddy telugu rajyam

  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రవేశపెట్టిన జగనన్న విద్య కానుక విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు విజయసాయి రెడ్డిగా కౌంటర్ ఇస్తూ, “జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను పచ్చ నేతలు కక్కేస్తున్నారని అన్నారు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే వుండండి అంటూ ” తనదైన శైలిలో గట్టి చురకలు అంటించాడు.  ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ఇటీవల సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42.34 లక్షల మంది విద్యార్ధులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో 3 జతల యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్, మాస్క్ ఉండనున్నాయి..

jagananna vidya kanuka

 దీనిపై సహజంగానే విమర్శలు వస్తుంటాయి. ఈ పధకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 60 % ఉందని, కేవలం 40 % వాటానే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ, పైకి మాత్రం ఇది జగనన్న కానుక అంటూ ప్రచారం చేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి ఆదిమలుపు సురేష్ మాట్లాడుతూ ఈ పధకంలో 100 % శాతం నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దమ్ముంటే నిరూపించండి అంటూ మంత్రి సవాళ్లు విసిరాడు. ఎలాంటి సమయంలో విజయ సాయి రెడ్డి ఈ పధకం విషయంలో ప్రతిపక్షాలపై గట్టి విమర్శలే చేయటం, ప్రాధాన్యత సంతరించుకుంది.