Vijay-Puri Jagannath: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే.. ఈసారైనా హిట్ పడుతుందా?

Vijay-Puri Jagannath: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు కాస్త ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే హీరోలు పోటీ పడేవారు. కానీ ప్రస్తుతం ఆయనతో సినిమా అంటే నో చెప్పేస్తున్నారు. దీంతో ఇలా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు హీరో విజయ్ సేతుపతి. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఈ వార్తలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే వచ్చేనెల అనగా జూన్ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోందట. కాగా మూవీలో ట‌బుతో పాటు క‌న్న‌డ న‌టుడు విజ‌య్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారట. అయితే ప్ర‌స్తుతం షూటింగ్ లొకేష‌న్స్ కోసం యూనిట్ హైద‌రాబాద్‌ తో పాటు చెన్నైలో రెక్కీ నిర్వ‌హిస్తున్నారట.

మొదటి షెడ్యూల్‌ లో విజ‌య్ సేతుప‌తి, ట‌బుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందట. అన్ని భాష‌ల‌కు యాప్ట్ అయ్యేలా ఈ టైటిల్‌ ను నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్‌ లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తాడ‌ట. అలాగే మ‌ల్టీపుల్ వేరియేష‌న్స్‌తో విజ‌య్ సేతుప‌తి పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు. మరి వరుస ప్లాప్ లతో సతమవుతమవుతున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి. ఈ సినిమాతో ఎలా అయినా హిట్టు కొట్టాలని పూరి జగన్నాథ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి మరి.