Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో విజయ్ దేవరకొండ ఒకరు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లైగర్” సినిమాలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో తొలినాళ్ళలో జరిగిన ఒక సంఘటన గురించి విజయ్ తాజాగా చర్చించారు.
ఇటీవల బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో లో విజయ్ దేవరకొండ, చార్మి,పూరి జగన్నాథ్ పాల్గొన్నారు. ఈ షో లో బాలకృష్ణ విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అడగగా విజయ్ ఈ విషయం గురించి బయట పెట్టాడు. ఇది తన కెరీర్ ప్రారంభంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ,ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలలో హీరో గా కాకుండా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సమయంలో ‘ఏ మంత్రం వేసావే’ అనే సినిమాలో పూర్తి హీరో క్యారెక్టర్ లో నటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈలోగా విజయ్ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాలు విడుదలై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ఈ సినిమాల ద్వారా విజయ్ కు సెన్సేషనల్ హీరో అనే ట్యాగ్ వచ్చింది.ఆ రెండు సినిమాల ద్వారా విజయ్ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న తర్వాత ఏ మంత్రం వేసావే సినిమా బృందం విజయ్ నీ కలిసి ఏ మంత్రం వేసావే సినిమా విడుదల చేయాలనుకుంటున్నామని ఆ సినిమా కోసం ప్రచారం చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారట. కానీ విజయ్ అందుకు అంగీకరించలేదు. బాగా రానీ సినిమా ప్రచారం చేయటం పద్ధతి కాదని విజయ్ వారి ఆఫర్ ని తిరస్కరించాడట. “నా ఫేమ్ ఉపయోగించుకొని సినిమా విడుదల చేసి డబ్బులు క్యాష్ చేసుకోవాలి అనుకుంటే సంపాదించుకోండి” అని కచ్చితంగా విజయ్ వారికి చెప్పేశాడట. విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా గురించి ఏం మాట్లాడను అని కూడా చెప్పేశారట. అనుకున్నట్టుగానే ఆ సినిమా రావడం వెళ్ళిపోవటం జరిగింది.