విజయ్ దేవరకొండ ‘లైగర్’ నుండి డ్యాన్స్ నంబర్ కోకా 2.0 పాట విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లోని పెప్పీ నంబర్ అక్డి పక్డి హ్యాంగోవర్‌ నుండి ఇంకా బయటికిరాకముందే, ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో విడుదలైన కోకా 2.0 పాట సెలబ్రేషన్స్ ని మరింత పెంచింది.

లిజో జార్జ్-డిజె చేతస్ మరొక డ్యాన్స్ నంబర్‌తో ముందుకు వచ్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఎలిగెంట్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే డ్రెస్సింగ్, వైబ్రెంట్ సెట్, కొరియోగ్రఫీ.. ఇలా ప్రతిది పర్ఫెక్ట్‌గా వుంది. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడడంలో రామ్ మిరియాల తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ, అనన్య పాండే అదిరిపోయే డ్యాన్సులు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ భాంగ్రా స్టెప్పులు మెస్మరైజ్ చేశాయి. ఈ పాటలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోకా 2.0 పాట ప్రధానంగా వేడుకల్లో మారుమ్రోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

థీమ్ సాంగ్, అక్డి పక్డీ యావత్ దేశాన్నిషేక్ చేయగా, థియేట్రికల్ ట్రైలర్ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, లైగర్ యూనిట్ దేశంలోని వివిధ నగరాల్లో ప్రమోషనల్ టూర్‌లో ఉన్నారు. ప్రతి ఈవెంట్‌కు భారీ సంఖ్యలో జనం హాజరౌతున్నారు.

ఆగస్టు 14న వరంగల్‌ హనమకొండలోని సుబేదారి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లైగర్ భారీ ఫ్యాండమ్ టూర్ నిర్వహించనున్నారు. మొత్తం చిత్ర యూనిట్ పాల్గొనే ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలౌతుంది.

తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: కేచ