యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగానే కాదు వ్యాపారాల్లోనూ బిజీనే. ఒక్క సినిమాలను ఎనమ్ముకుంటే లాభం లేదని అనుకున్నాడో ఏమో కానీ వరుసపెట్టి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నాడు. ముందుగా రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం స్టార్ట్ చేసిన విజయ్ ఆతర్వాత నిర్మాతగా మారారు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. అవి ఆలా ఉండగానే థియేటర్ బిజినెస్లోకి కూడ ఎంటరయ్యాడు. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు.
అది కూడ తన సొంత ఊరు అయిన మహబూబ్ నగర్ జిల్లాలో కావడం విశేషం. ఏషియన్, మహేష్ బాబు కలిసి ఎలాగైతే ఏఎంబీ సినిమాస్ అని స్థాపించారో అలాగే విజయ్, ఏషియన్ సినిమాస్ కలిసి ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. దాదాపు థియేటర్ల నిర్మాణం పూర్తయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ఈ థియేటర్లు ఆరంభంకానున్నాయట. అంటే విజయ్ పవన్ సినిమాతోనే కొత్త వ్యాపారానికి శ్రీకారం చుడుతున్నారన్నమాట.