Vijay Deverakonda: పెంపుడు కుక్కని చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లిన రౌడీ హీరో.. వీడియో వైరల్?

Vijay Deverakonda: సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఈ మధ్య ఎక్కువగా ఆడియో ఫంక్షన్ లకి, టీజర్ రిలీజ్ ఫంక్షన్ లకి, సక్సెస్ మీట్ లకు ఎక్కువగా వారి స్పెషల్ ఫ్లైట్స్ ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు తోటి సహచరులను కానీ, లేదంటే వారి స్టాఫ్ ని కానీ తీసుకెళ్తూ ఉంటారు. కానీ మొదటిసారిగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ధైర్యం చేసి తనతో పాటు తన పెంపుడు కుక్కని ఫ్లైట్ లో తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తు, వీడియో పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే హాలీవుడ్ లో సెలబ్రిటీలతో పాటు వారి పెంపుడు జంతువులను తీసుకెళ్ళడం అన్నది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ చార్టెడ్ ఫ్లైట్ సంస్కృతి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి చేరుకుంది. ఇక దీన్ని మొట్టమొదటిగా ఆచరించిన హీరో విజయ్ దేవరకొండ. ఇకపోతే ఈ వీడియో పై నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

 

కొందరు నెటిజన్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్స్ చేయగా, ఇంకొందరు అందుకోసం పెట్టిన ఖర్చుతో ఎంతోమంది పేద వారిని ఆదుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే పెంపుడు కుక్క ను ఫ్లైట్ లో ఎక్కించడం తప్పులేదు కానీ, అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేయడం బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.