kingdom Movie: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం సినిమా హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే విజయ్ చివరగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.
ఈ సినిమా కంటే ముందు సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమా విడుదల అయ్యే సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ నీ పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ పోస్టర్లు అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
#KINGDOM
Trailer is coming.JULY 26th – Tirupati 🙏❤️ pic.twitter.com/a5t3mZukeU
— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2025
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కింగ్‌డమ్ మూవీ ట్రైలర్ తేదీని ప్రకటించారు. ఈ నెల 26న మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. తిరుపతిలో ట్రైలర్ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ ఫీవర్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకొని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొనున్నారు. కాగా తాజాగా మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టర్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ స్పందిస్తూ ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
