విజయ్ దేవరకొండ ని లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్

స్టార్ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్, రెండు దశాబ్దాల అనుభవం ఉన్నా కానీ మంచు బ్రదర్స్, అక్కినేని బ్రదర్స్ ఇప్పటివరకు స్టార్ హోదా అందుకోలేదు. కానీ, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా….ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. విజయ్ ని చూసి అసూయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరో అయ్యాక విజయ్ బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఈ విషయం లో ఫాన్స్ కూడా విజయ్ మీద కోపం గా ఉన్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమాతో విజయ్ పాన్  ఇండియా స్టార్ అయిపోతాడు అనుకున్నారు, కానీ ఆ సినిమా బాక్స్-ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో విజయ్ దేవరకొండ తో సినిమాలంటే టాప్ డైరెక్టర్స్ భయపడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం, విజయ్ తో సినిమా అనౌన్స్ చేసిన సుకుమార్ ఇప్పుడు విజయ్ సినిమాని పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. ‘పుష్ప’ తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ తో బిజీ గా ఉన్నాడు. విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నాడు

‘పుష్ప’ తర్వాత సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇలా సుక్కు , విజయ్ వరుస సినిమాలతో బిజీ గా ఉండడంతో..వీరి కాంబో మూవీ ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.