Vijaya Devarakonda: విజయ్ దేవరకొండకు అప్పుడు మార్కెట్ లేదు..ఇప్పుడు 25కోట్లు తీసుకుంటున్నాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

ప్రతీ ఒక్కరూ హిట్ సినిమా తీయాలనే ప్రయత్నిస్తారని, తాను కూడా ప్రయత్నం చేసి 4 సినిమాలు తీస్తే, ఆ నాలుగూ ఫ్లాఫ్ అయ్యాయని నిర్మాత రామ సత్యనారాయణ అన్నారు. కాబట్టి తన అంచనా తప్పు. హిట్ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోవద్దు. కానీ ఫ్లాఫ్ సినిమాను సేఫ్‌గా ఎలా తీయాలి అనేది ఆలోచించాలని ఆయన చెప్పారు.

ఉదాహరణకు తీసుకుంటే పెళ్లి చూపులు సినిమానే చూస్తే, ఆ సినిమా హిట్టయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ఓపెనింగ్‌కి తాను వెళ్లానని, ఆ చిత్ర నిర్మాత కూడా తనకు మంచి ఫ్రెండ్ అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా తన ఉద్దేశం ప్రకారం ఏమనుకున్నానంటే కొత్త హీరో, పెళ్లి చూపులు కథ ఏం ఆడుతుందిలే అని అనుకున్నానని సత్యనారాయణ చెప్పారు. నిజానికి తనకు కథేంటో కూడా తెలియదని, విజయ్ దేవరకొండ కూడా తెలియదు. అదీ గాక అతనికి అప్పుడు మార్కెట్ కూడా లేదని ఆయన అన్నారు. కానీ అంతా తలకిందులైంది. సినిమా మంచి హిట్ అయింది. నేషనల్ అవార్డు వచ్చింది. 20కోట్ల బిజినెస్ చేసింది అని ఆయన తెలిపారు.

ఇవన్నీ సాధ్యం కావడంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ మంచి హీరోగా టాప్‌లో నిలిచాడని, ప్రస్తుతం 25కోట్ల హీరోగా మారిపోయాడని సత్యనారాయణ అన్నారు. అంటే తాను ఒకప్పుడు నెగెటివ్ అనుకున్నది పాజిటివ్‌గా మారింది అని ఆయన చెప్పారు. ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్ మెంటల్ మదిలో అనే సినిమా తీశారు. కానీ అంతగా ఆడలేదని సత్యనారాయణ అన్నారు. అయినా కూడా అతను దాన్ని పాజిటివ్‌గా చేసుకున్నారని, ఆ సినిమాను ఓటీటీ వాళ్లు కొనుక్కోవడం ఆయనకు ప్లస్‌గా మారిందని రామ సత్యనారాయణ వివరించారు.