విజయ్ దేవరకొండా… ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా!ఇప్పుడు చూడు ఏమైందో..

vijay devarakonda comments on elections got mixed reviews

గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా మార్మోగిపోతున్న ఒక హీరో పేరు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ కి కూడా ఆయన మీద అభిమానం పాకి పోయింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిలో పడిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్లో అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి అభిమాన కధానాయకుడు అయిపోయాడు.ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్‌లతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు ‘అర్జున్ రెడ్డి’ తో రౌడీ అనే బ్రాండ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.

vijay devarakonda comments on elections got mixed reviews
vijay devarakonda in arjun reddy

ప్రస్తుతం ఇతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఫైటర్’ మూవీతో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు సుకుమార్‌తో మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్ చేసాడు. అంతేకాదు మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా తొలి స్థానంలో నిలిచి సంచలనం క్రియేట్ చేసాడు. ఇక లాక్‌డౌన్ సమయంలో ‘ది దేవరకొండ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి పేదవాళ్లను,బడుగులను ఆదుకున్నారు. ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ సడలింపులతో ప్రస్తుతానికి తన సేవలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో చిట్‌చాట్ చేస్తుండగా “లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు అసలు ఓటు హక్కు అనేది లేకుండా చేయాలని కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ. పైసలు కోసం, లిక్కర్ కోసం ఓటును అమ్మకానికి పెట్టే వాళ్లకు ఓటు విలువ తెలియదని అలాంటి వాళ్లకు ఓటు హక్కు ఎందుకని” విజయ్ అభిప్రాయపడ్డాడు.

అలాగే బాగా ధనవంతులకు కూడా ఓటు హక్కు ఉండకూడదన్నారు. చదువుకున్న మిడిల్ క్లాస్ వాళ్లకు మాత్రమే ఓటు విలువ తెలసన్నాడు. అలాంటి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు.చెప్పింది వినటానికి బానే ఉన్నా, విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. కొందరు విజయ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్‌ను ట్రోల్ చేస్తున్నారు. డెమోక్రసీ లో వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేసే హక్కు అందరికి ఉంటది, కాబట్టి విజయ్ ని సమర్ధించేవారిని మరియు ట్రోల్ చేసేవారిని కూడా తప్పు అని అనలేము. ఇలాంటి వాటికి విజయ్ ఎలా తిరిగి కౌంటర్ ఇస్తాడో చూడాలి.