మహేష్ బాబు థియేటర్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. ఏ సినిమా చూశారంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన లైగర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అదేవిధంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్ తో విజయ్ దేవరకొండ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈయన మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇకపోతే ఈయన ఏ సినిమా చూడటం కోసం ఈ థియేటర్ కి వచ్చారనే విషయానికి వస్తే హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన Top Gun: Maverick సినిమాను వీక్షించాడు. ఈ క్రమంలో థియేటర్లో దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో ఎంతో సింపుల్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ విజయ్ దేవరకొండ అభిమానులు సందడి చేశారు. ఇక ఈయన నటించిన లైగర్ సినిమా తన కెరియర్ కు ఎంతో సెంటిమెంట్ అయినటువంటి ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఖుషి సినిమా షూటింగ్ పూర్తి అయిన అనంతరం తిరిగి పూరీజగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.ఈ విధంగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.