Maargan Trailer: మరో క్రేజీ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించబోతున్న విజయ్ ఆంటోనీ.. ట్రైలర్ రిలీజ్!

Maargan Trailer: హీరో నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ఆంటోనీ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగులో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే విజయ్ ఆంటోనీ స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ గత కొన్ని ఏళ్లుగా హీరోగా వరస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. విజయ నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ అవుతున్నాయి.

అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో జనాల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ కూడా చేస్తారేమో చూడాలి మరి. అయితే సాధారణంగా మనం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తుంటాం. ఇది ఆ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. స్విమ్మర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక కుర్రాడు అమ్మాయిలకు ఒక రకమైన డ్రగ్ ఇచ్చి చంపుతుంటాడు.

Maargan - Official Trailer | Vijay Antony | Ajay Dhishan | Leo John Paul

దీని వల్ల శరీరమంతా నల్లగా మారి చనిపోతుంటారు. హీరో అయిన పోలీస్ కూడా దీని బారిన సగం పడతాడు. అంటే సగం శరీరం నల్లగా మారి ఉంటుంది. సదరు పోలీసు దొంగని ఎలా పట్టుకున్నాడు? అసలు అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాన్ని కనిపెట్టాడా లేదా? అనేదే స్టోరీ. అయితే ట్రైలర్ మాత్రం మంచి క్రేజీగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ట్రైలర్. మరి ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి. కాగా ఈ సినిమా రేపు నెల అనగా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.