Vicky Kaushal- Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మొన్నటి వరకు ప్రేమలో మునిగి తేలి మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు. గురువారం 9 న పెద్దల సమక్షం లో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వరాలో విక్ట్రినా ( విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్) వివాహం ఘనంగా జరిగింది. కేవలం ఇరుకుటుంబాల పెద్దలు, బంధువులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీళ్ళ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అయితే విక్ట్రినా పెళ్లి జరిగే వరకు దీనికి సంబంధించిన అప్ డేట్స్ బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
పెళ్ళికి సంబంధించిన ఎటువంటి తంతు కార్యక్రమాల ఫొటోస్ పెళ్లి అయ్యేవరకు బయట పెట్టలేదు విక్ట్రినా జంట. కానీ, పెళ్లి అయిన వెంటనే తాము ఒక్కటయ్యామంటూ సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకి వెల్లడించింది. నెమ్మది నెమ్మదిగా పెళ్లి కి ముందు జరిగిన కొన్ని కార్యక్రమాల ఫోటోలని బయట పడుతుంది విక్ట్రినా జంట.
ఈ క్రమం లో విక్ట్రినా జంట హల్దీ సెర్మనీ కి సంబంధించిన ఫోటోలని బయట పెట్టారు. రోజుకొక ఫంక్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యాలని విక్ట్రినా జంట అనుకుంది కాబోలు. నిన్న హల్దీ ఫంక్షన్, ఇవ్వాళా మెహిందీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలని విక్ట్రినా తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల ద్వారా విడుదల చేసారు. అయితే ఈ మెహిందీ ఫంక్షన్ లో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. కత్రినా కైఫ్ తన మామ తో (విక్కీ కౌశల్ తండ్రి) కలిసి భాంగ్రా చేస్తున్న పిక్ నెట్టింట్లో హంగామా చేస్తుంది.