Katrina Kaif: కత్రినా కైఫ్, విక్కీ కౌషల్… ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ మొన్నటి వరకు ప్రేమలో మునిగి తేలి మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు. గురువారం 9 న పెద్దల సమక్షం లో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వరాలో విక్ట్రినా ( విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్) వివాహం ఘనంగా జరిగింది. కేవలం ఇరుకుటుంబాల పెద్దలు, బంధువులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీళ్ళ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకి బీ టౌన్ తారలతో పాటు అతిరథ మహారథులు కూడా విచ్చేసారు. ఈ నెల 20న జరగబోయే రిసెప్షన్ కి ముందస్తు సన్నాహాలు చేస్తుంది విక్ట్రినా జంట. ఈ ఫంక్షన్ కి కూడా బాలీవుడ్ తారలందరూ హాజరుకాబోతున్నారని సమాచారం. అయితే కొత్తగా అత్తింట్లోకి అడుగుపెట్టిన కత్రినా అప్పుడే అక్కడి ఆచారాలని వంటబట్టించుకుందట. పెళ్ళిలో కూడా పంజాబీ సాంప్రదాయ ఉట్టిపడేలా తయారయ్యింది కత్రినా. అయితే అత్తంటిలోకి అడుగుపెట్టిన కత్రినా తన భర్త విక్కీ కి, అత్త మామలకి ఓ ప్రతేకమైన వంటకాన్ని వండి రుచి చూపించిందట.
అయితే తాను చేసిన వంటకాన్ని ‘మొదటిసారి చేసినా.. రుచిగానే ఉంది అంటూ’ తన అభిమానులతో పంచుకుంది కత్రినా. ఇంతకీ ఆమె చేసిన వంటకం ఏంటంటే.. షీరా అనే తీపి వంటకం. ఈ వంటకం తాలూకు ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ.. మైనే బనాయా అంటూ కాప్షన్ రాసుకొచ్చింది కత్రినా.. అయితే, విపరీతంగా మెచ్చిన ఈ ఫోటోని నెట్టింట్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.