Vicky Kaushal- Katrina Kaif: పెళ్ళికి సంబంధించిన ఎటువంటి తంతు కార్యక్రమాల ఫొటోస్ పెళ్లి అయ్యేవరకు బయట పెట్టలేదు విక్ట్రినా జంట. కానీ, పెళ్లి అయిన వెంటనే తాము ఒక్కటయ్యామంటూ సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకి వెల్లడించింది. అయితే విక్ట్రినా పెళ్లి జరిగే వరకు దీనికి సంబంధించిన అప్ డేట్స్ బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నెమ్మది నెమ్మదిగా పెళ్లి కి ముందు జరిగిన కొన్ని కార్యక్రమాల ఫోటోలని బయట పడుతుంది విక్ట్రినా జంట.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ మొన్నటి వరకు ప్రేమలో మునిగి తేలి మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు. గురువారం 9 న పెద్దల సమక్షం లో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వరాలో విక్ట్రినా ( విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్) వివాహం ఘనంగా జరిగింది. కేవలం ఇరుకుటుంబాల పెద్దలు, బంధువులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీళ్ళ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అయితే తాజాగా మరికొన్ని అద్భుత ఫొటోస్ ని తన తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతానుండి షేర్ చేశారు విక్ట్రినా జంట. అయితే ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.