కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల బాధ్యత రాష్ర్టాలిదేనని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఎవడి చావు వాడు చావండని వలస బాధితుల్ని గాలికొదిలేసింది. కనీసం కేంద్రం నుంచి ఫలానా సాయం చేస్తామని మాట వరసకి కూడా అనలేదు. కావాలంటే రైళ్లు వేస్తాం..ఆ ఖర్చు లు కూడా రాష్ర్టాలే భరించలని అన్యాయంగా వ్యవరించింది. దీంతో వలస బాధల్ని నెత్తిన వేసుకున్న రాష్ర్టాలు వేసుకున్నాయి. పట్టించుకోని రాష్ర్టాలు వదిలేసాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వలస కార్మికుల బాధ్యతల్ని కొంత వరకూ తీసుకుంది. తక్షణం రాష్ర్ట సరిహద్దుల వరకూ వాళ్లని బస్సులు వేసి దింపాలని నిర్ణయించింది.
అలాగే భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వాస్తవానికి వేరే రాష్ర్టాల నుంచి వచ్చి వేర్వేరు రాష్ర్టాలో బ్రతుకుతున్న వారు వీరంతా. ఇది ఏ రాష్ర్టానికి సంబంధించిన విషయం కాదు. కేవలం జాతీయ విపత్తు కారణంగా తలెత్తిన సమస్య కాబట్టి దాన్ని కేంద్రమే భరించాలి. కానీ కేంద్రం రాష్ర్టాల మీదకు తోసేసి మాకేం సంబంధం లేదని చెప్పేసింది. దీంతో కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షం సహా ప్రజలు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వలస కార్మికులను ఆదుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. పేదోళ్లని పట్టించుకోక పోతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడనని ప్రకటించారు. నిరాహారకు దీక్షకు దిగిన వీహెచ్ నిమ్మరసం తాగి దీక్షను తాత్కలికంగా విరమించారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని..కాంగ్రెస్ సీనియర్ నేత చొరవ తీసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పక్షంపై మండిపడ్డారు.