RGV: త్వరలో నాగ బాబుని కలవబోతున్న వర్మ.. కారణం ఇదేనా?

RGV: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు ఉండరు . రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించాడు . తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఏపీ గవర్నమెంట్ కు 10 ప్రశ్నలు సంధించారు . ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు రామ్ గోపాల్ వర్మకి మద్దతు పలకటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ నాగబాబు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారిద్దరి మధ్య అంతటి వైర్యం ఉండేది . కానీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ ధరల ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పై ఏం చేస్తున్న విమర్శలకు నాగబాబు మద్దతు పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్స్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించుకునేవారు. ప్రస్తుతం అలాంటి వారిద్దరూ కలిసిపోయారు. అంతేకాకుండా వర్మ త్వరలో నాగబాబుని కలవటానికి కూడా సిద్ధమయ్యారు . వర్మ జగన్ సర్కార్ పై ప్రశ్నలు వేస్తున్న తరుణంలో నాగబాబు వర్మ వాదనకు జై కొట్టారు .

తాజాగా జగన్ సర్కార్ పై వర్మ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తున్న నాగబాబు .. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టికెట్ రేటు విధానాలపై ఆర్గీవి చెప్పింది అక్షరాల నిజం.. తన నోటిలో నుండి వచ్చే ప్రశ్నలు వర్మ బయటపెట్టారు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఆ విషయంపై వర్మ కూడా స్పందించారు . ఈ తరుణంలోనే ఒకప్పుడు వారిద్దరి మధ్య జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు .సినిమా టికెట్ రేట్ ఇష్యూ ఫై నాకు బాబు స్పందించారు.. నేను కూడా రెస్పాండ్ అయ్యాను.. నాగబాబుతో నాకు మంచి రిలేషన్ ఉంది.. వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా చేస్తున్నప్పుడు నేను నాగబాబును కలిశాను. అయినా గతంలో ఆయన ఆవేశంలో స్టేజి మీద ఏదో అనేసాడు.. నేను కూడా వోడ్కా మత్తులో ఏదో అనేసాను .కానీ ప్రస్తుతం నేను నాగబాబుని రెస్పెక్ట్ చేస్తున్న.. లాజిక్ అనేది ఒక్కటే కనెక్టింగ్ ఫ్యాక్టర్.. టైమ్ ని బట్టి ఎమోషన్స్ మారుతాయి.. ఎమోషన్స్ కి లాజిక్స్ ఉండవు అని RGV తెలిపారు. నాకు మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నాకు నాగబాబు వల్ల జీరో పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు.. నాగబాబు నన్ను అభినందించిన తరుణంలో నేను ఆయనకు థాంక్స్ చెబుతున్నా.. త్వరలోనే ఆయన్ను కలవబోతున్నా అని వర్మ వెల్లడించారు .