RGV Strong Counter: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ, వైసీపీ ప్రభుత్వం మధ్య టికెట్ల విషయంపై పెద్ద వివాదం చెలరేగుతోంది.వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఇలా సినిమా రేట్లను తగ్గిస్తే పెద్ద సినిమాలు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది అంటూ పలువురు సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించారు.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ కూడా ఈ టికెట్ల వ్యవహారం పై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు.
ఇలా రెండు రోజుల పాటు వరుసగా ఏపీ మంత్రులకు, వర్మకు మధ్య ట్వీట్ల వార్ జరిగింది. ఈ క్రమంలోని ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోని మంత్రిని కలిసిన వర్మ సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల కలిగే నష్టాల గురించి మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైసిపి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా వేదికగా మాట్లాడుతూ సినిమా హీరోల గురించి షాకింగ్ కామెంట్ చేశారు. వీరికి చంద్రబాబు నాయుడు అండ ఉందని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని ఒక్కో సినిమాకు వంద కోట్ల తీసుకోవటం వల్ల హీరోలు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ మరోసారి స్పందిస్తూ ఒక న్యూస్ డిబేట్ లో పాల్గొని సదరు ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. నాకు జగన్ అంటే ఎంతో అభిమానం కానీ ఇలాంటి ఇడియట్స్ కారణంగా అతనికి చెడ్డపేరు వస్తుంది. వీరికి సినిమా గురించి ఏమి తెలియకపోయినప్పటికీ ఇలా మాట్లాడుతుంటారు. అలాంటి వాటి గురించి మాట్లాడటంటైం వేస్ట్ అంటూ వర్మ సదరు ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.