అల్లు అర్జున్ కండిషన్స్.. కిందా మీదా పడుతున్న దర్శకుడు

Venu Sriram unhappy with Allu Arjun demand
Venu Sriram unhappy with Allu Arjun demand
అల్లు అర్జున్ తన ‘ఐకాన్’ చిత్రాన్ని చాలా నెలల క్రితమే ప్రకటించారు.  వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది.  అయితే మధ్యలో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ కూడ వచ్చాయి.  తర్వాత వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ చేయడం, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం జరిగాయి.  దీంతో మళ్లీ ‘ఐకాన్’ తెరమీదకు వచ్చింది.  సినిమాను చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు బన్నీ.  పలు చర్చలు, లెక్కల తరవాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడు.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప 1’ పూర్తయ్యాక వెంటనే దీన్ని పట్టాలెక్కించనున్నారు.  
 
అయితే ఇక్కడే అల్లు అర్జున్ ఒక మెలిక పెట్టాడట. చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లోనే ఉండాలనే నియమం పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అందుకు అనుగుణంగానే కథలని ఎంచుకుంటున్నాడు.  ‘పుష్ప’ రెండు ముక్కలు కావడానికి కూడ ఇదే ప్రధాన కారణం.  ‘పుష్ప’ తర్వాత వచ్చే చిత్రం కాబట్టి ‘ఐకాన్’ చాలా గొప్పగా ఉండాలని, అందుకు తగ్గట్టు కథను రూపొందించమని, కథ తాను ఆశించినట్టు తయారైతేనే ప్రాజెక్ట్ టేకాఫ్ దర్శకుడికి కండిషన్ పెట్టాడట.  ఇదే వేణు శ్రీరామ్ కి తలనొప్పిగా మారిందట.  ఎందుకంటే ‘ఐకాన్’ కథను చాలా నెలల క్రితమే పూర్తిగా రాసి పెట్టుకున్నాడు ఆయన.  సీన్ టూ సీన్ కథ పక్కాగా ఉంది.  అల్లు అర్జున్ అడుగుతున్న ప్రకారం కథలో చాలా మార్పులే చేయాల్సి ఉంటుందట.  అలా చేస్తే కథను కొత్తగా రాసినట్టేనని, పాత ఫ్లేవర్ పోయి కొత్త ఫ్లేవర్ వచ్చి చేరుతుందని అప్సెట్ అవుతున్నాడట.