షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ, రానా వెబ్ సిరీస్.. త్వరలోనే ట్రైలర్ లాంచ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ రానా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ ఇది వరకు ఎంతో మంది హీరోలతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే తన కొడుకు రానాతో కలిసి ఈయన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో రానా ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా నటిస్తుండగా, అతని తండ్రిగా, జైలు నుండే అన్ని కార్యక్రమాలను సెట్ చేసే వ్యక్తి పాత్రలో వెంకటేష్ సందడి చేయనున్నారు. ఇలా మొట్టమొదటిసారిగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం వెంకటేష్ రానా ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లెక్స్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్ సుర్వీన్ చావ్లాతో ఈ వెబ్ సీరిస్ లో అభిషేక్ బెనర్జీ, జాను టిబ్రేవాల్, సౌరవ్ ఖురానా, అభిషేక్ భలేరావ్ వంటి తదితరులు నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగులో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కి కరన్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ఈ విధంగా మొట్టమొదటి సారి బాబాయ్ అబ్బాయ్ ఇద్దరు కలిసి ఓకే స్క్రీన్ పై తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.