వెబ్ సిరీస్ వలలో వెంకటేష్

Venkatesh to do web series
Venkatesh to do web series
ప్రజెంట్ వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది నటీనటులు వెబ్ సిరీస్ చేయడానికిఓ ఆసక్తి చూపుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు స్వయంగా వీటిని నిర్మిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తిగా ఉంటున్నారు. ఇతర భాషల్లో రొపొందిన వాటిని అమితంగా ఆదరిస్తున్నారు. అందుకే తెలుగు స్టార్ల దృష్టి వీటి మీద పడింది.  కొందరి మంచి కథ దొరికితే వెబ్ సిరీస్ చేయాలనే ఉత్సాహంలో ఉన్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ కూడ ఉన్నారట.  
 
వెంకటేష్ మహా దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్ మహా ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.  అది ఈ ఏడాది చివరకు పూర్తికానుంది.  కనుక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వెబ్ సిరీస్ మొదలుకావొచ్చని తెలుస్తోంది.  ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తుందట. వెంకటేష్ ఇటీవలే ‘నారప్ప, దృశ్యం 2’ చిత్రాలను పూర్తి చేశారు. ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. అది కూడ ఈ ఏడాది ఆఖరికి పూర్తయ్యేలా ఉంది. ఇక వెంకటేష్ మహా విషయానికి వస్తే ఆయన కథలు ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ మీదనే ఉంటాయి. కాబట్టి వెబ్ సిరీస్ కూడ అలాంటి ఎమోషన్స్ మీదనే ఉండొచ్చు.