విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి చేస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఆసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ఎంతో సహజంగా అనిపించడంతో వెంకటేష్ రీమేక్ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం ముగిసింది. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. వెంకీ, శ్రీకాంత్ అడ్డాల సినిమా వచ్చిన తీరు పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట.
ఈ సినిమాను మే 14న వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మే 13న మెగాస్టార్ చిరు ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. రెండూ పెద్ద సినిమాలే కాబట్టి కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ అంటే బాక్సాఫీస్ క్లాష్ తప్పదు. అల్టిమేట్ గా ‘నారప్ప’కే నష్టం. అందుకే విడుదల తేదీని మార్చాలని చూస్తున్నారట. ఏప్రిల్ 30న లేదా మే 28న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఏప్రిల్ 30న రానా ‘విరాటపర్వం’ ఉంది. మే 28వ తేదీన బాలయ్య బోయపాటి సినిమా ఉంది. వీటిలో ఏదో ఒక సినిమా మీద వెంకీ పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఆ పోటీ ఎవరి మీదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.