విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ఒక రోజు సమయం ఉండటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్రబృందం సినిమాకు సంబంధించిన విషయాలను వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ముచ్చటించిన వెంకటేష్ తాను సెట్లోకి అడుగు పెట్టగానే నిర్మాత పక్షాన మాట్లాడతానని సెట్ లో ఏది వృధా అవుతున్న అసలు సహించని, ఆయన తెలిపారు.ఇక పాన్ ఇండియా సినిమాలు గురించి కూడా వెంకటేష్ మాట్లాడుతూ సరైన టీమ్ కుదిరినప్పుడు తప్పకుండా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తానని తెలిపారు.ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోలు బుల్లితెర పై పలు రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ విషయం గురించి వెంకటేష్ ను ప్రశ్నించగా రియాలిటీ షోలలో పాల్గొనడం చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు.
రియాలిటీ షోలలో భాగంగా చెప్పిన డైలాగ్ పదేపదే చెబుతూ ఎక్స్ప్రెషన్స్ మరి మరి ఇవ్వడంతో తనకు మొత్తం బ్లాక్ అవుతుందని అందుకే తను రియాలిటీ షో లకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇక తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురుకావడంతో ఈ విషయంపై వెంకటేష్ స్పందిస్తూ ప్రస్తుతం తన కుమారుడు చదువులపై దృష్టి పెట్టారని అయితే తన సినీ ఎంట్రీ గురించి ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు లేవని ఈ సందర్భంగా వెంకటేష్ తన కొడుకు గురించి వెల్లడించారు.