రానా పెట్టిన పోస్టు పై స్పందించిన వెంకటేష్ కూతురు.. ఎదురు చూస్తున్నానంటూ కామెంట్!

ప్రస్తుతం థియేటర్లలో వెంకటేష్, వరుణ్ తేజ్ సందడి చేస్తున్నారు. ఇటీవల F3 సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. అప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంత చేసుకొని భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా దగ్గుబాటి వారసులు కలిసి నటించిన సినిమా గురించి అప్డేట్ వచ్చింది. దగ్గుబాటి రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ రానా ఇద్దరు కలిసి” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం వెంకటేష్ కొత్త లుక్ తో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. సాధారణంగా ఇలా హీరోల కొత్త లుక్స్ తొందరగా లీక్ అవుతాయి.కానీ వెంకటేష్ మాత్రం తన కొత్త లుక్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న “రానా నాయుడు” వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయినట్టు నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది. దీంతో వెంకటేష్, రానా ఇద్దరి కూడా దీని గురించి అప్డేట్స్ ఇచ్చారు.

ఇటీవల “రానా నాయుడు” వెబ్ సిరిస్ కోసం పనిచేసిన టీమ్ మొత్తం ఫోటో షూట్ జరిగింది. ఈ సందర్భంగా రానా ఇన్ స్టా గ్రామ్ లో ఫోటో షేర్ చేశాడు. ఈ పోస్టు చూసి వెంకటేష్ కూతురు ఆశ్రిత స్పందించింది. ఈ పోస్టు చూసిన ఆమె ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టింది. ఆశ్రిత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత, రానా, విరానికా, మిహిక వంటి వారు పెట్టే పోస్టులకు ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఈమె ప్రస్తుతం విదేశాలలో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆశ్రిత చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.