ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా.. లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్

venkaiah naidu tests corona positive

కరోనా మహమ్మారి ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే చాలామంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా కరోనా సోకింది. తాజాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా సోకింది. తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే.. ఆయనలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో… ఆయన్ను హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.

venkaiah naidu tests corona positive
venkaiah naidu tests corona positive

అయితే.. వెంకయ్య భార్య ఉషకు మాత్రం నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ.. ఉషను ఐసోలేషన్ కు తరలించారు. వెంకయ్యనాయుడికి కరోనా సోకింది.. అనే విషయం తెలియగానే.. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, బీజేపీ నేతలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వెంకయ్య తొందరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ట్వీట్లు చేస్తున్నారు. తన తండ్రి వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వెంకయ్య కూతురు దీప పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఆయనకు అన్ని రకాల స్కాన్లు చేయగా… ఎటువంటి సమస్య లేదని.. దీప తెలిపారు.