Venkaiah Naidu: ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండగ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా కొన్ని అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. మన భారత సంస్కృతి వారసత్వం చాలా గొప్పదని.. భారతదేశ ఎదుగుదల చూసి ఇతర దేశాలకు అసూయ కలుగుతుందని అన్నాడు.
ఎటువంటి వివక్షత పాటించకూడదని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరాడు. కులము కంటే గుణము మిన్న అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. మన ఉనికిని కాపాడుకునేందుకు నిత్యం ప్రయత్నించాలి అని తెలిపాడు. అంతేకాకుండా మాతృభాషలోనే మాట్లాడాలని.. అమ్మభాష రాకుంటే అంతకు మించిన దారుణం మరొకటి లేదని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని తాకాయి.