Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక విలువలను ప్రోత్సహించే విధంగా ఎలాంటి సినిమాలు లేవని యువతను తప్పుడు మార్గంలో ప్రోత్సహించే సినిమాలె ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంటూ ఎంతోమంది సినిమాలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం టాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వాక్యాలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
వెంకయ్య నాయుడు ఇటీవల ఓ సినీ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోలు నటించిన సినిమాలు చూస్తే కనుక ప్రేక్షకులు ఒక మానసిక ఉల్లాసం కలిగేది అప్పట్లో సినిమాలు ఎంతో మంచి అర్థం దాగి ఉండేది ఇక విలన్ల గురించి మాట్లాడాల్సి వస్తే విలన్లకు సినిమా చివరికి హీరోలు గుణపాఠం చెప్పేవారు లేదంటే వారిని రాజమండ్రి జైలుకు తరలించేవారు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా భిన్నంగా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న సినిమాలలో హీరోలే విలన్లుగా మారుతున్నారని ఈయన తెలియజేశారు ప్రస్తుత కాలంలో ఒక స్మగ్లర్ ఒక దేశద్రోహులను హీరోలుగా చూపిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇలాంటి సినిమాలు రావటం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం కాదని ఇలాంటి సినిమాల కారణంగా యువత కూడా తప్పుడు మార్గంలో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు సినిమాని ఒక సినిమాగా ఒక వినోదాత్మక భరితంగా చేయాలి తప్ప ఒక వ్యాపారంలా భావించి సినిమాలు చేయొద్దు అంటూ వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పుష్ప సినిమాని ఉద్దేశించే ఉన్నాయి అంటూ ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. సినిమాని కేవలం సినిమాగా మాత్రమే చూడాలి అంటూ కామెంట్స్ పేడుతున్నారు. ఇక ఈయన స్మగ్లర్లు అని మాట్లాడటంతో ఖచ్చితంగా పుష్ప సినిమా గురించి మాట్లాడారని పలువురు భావిస్తున్నారు.