ఇదే జరిగితే వెల్లంపల్లి రాజీనామా గ్యారెంటీ ?

vellampalli srinivas

 రాష్ట్రంలో రామతీర్థం సంఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాయి. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజునూ ఉద్దేశించి వెధవ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. వెల్లంపల్లి నోటినుండి ఇలాంటి మాటలు రావటంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

vellampalli srinivasu

 దాదాపు ఐదొందల ఏళ్ల రాజ కుటుంబానికి చెందిన వారసుడు, రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు, విజయనగరం మొత్తం దేవుడిగా భావించే నేతను పట్టుకొని కనీసం మూడేళ్ళ మంత్రి అనుభవం లేని నేత ఇలాంటి పదజాలం ఉపయోగించి తిట్టటం దారుణమైన విషయం. రాజు అనుభవంతో పోల్చి చూస్తే కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా రాగలిగిన స్థాయి లేని వెల్లంపల్లి కేవలం ఒక మంత్రి పదవిని చూసుకొని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటం ఇప్పుడు వైసీపీ పార్టీ మెడకు చుట్టుకుంటుంది.

 వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు చాలా మంది అశోక గజపతి రాజుని దేవుడిగా భావిస్తారు. ఆయన కుటుంబం నీడలో పైకి వచ్చిన వాళ్ళలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. వైకాపా మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా అక్కడ చదువుకున్న వారే. వేలాది ఎకరాలను, భవనాలను ప్రభుత్వాలకు ఇచ్చారు, ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన భూముల్లోనే ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయి. దాదాపు 25 వేల ఎకరాలను అనేక దేవాలయాలకు, అభివృద్ధి పనులకు ధారాదత్తం చేసిన వంశానికి చెందిన వ్యక్తి గురించి మాట్లాడే ధైర్యం గతంలో ఎవరు చేయలేదు.

 రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా స్వర్ణయుగం అనుభవిస్తున్న సమయంలో కూడా మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కలగజేచుకోలేదు, దేశ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ఆ వంశస్తులకు వంగి వంగి నమస్కారాలు చేయటం గతంలో చూశారు , అలాంటి వంశ వ్యక్తిని వెల్లంపల్లి అవమానించటాన్ని రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ సెగలు ఇప్పటికే వైసీపీ సర్కార్ కు గట్టిగానే తగులుతున్నాయి, ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదు.

 హిందూ దేవుళ్లను జగన్ సర్కార్ టార్గెట్ చేసుకుందని అనేక మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పైగా అతని అసమర్ధతతోనే ఇలాంటి పనులు జరుగుతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మచ్చ పోవాలంటే ఆ శాఖకు మంత్రి అయినా వెల్లంపల్లికి ఉద్వాసన పలకటమే నయంమనే ఆలోచన కనుక జగన్ కు కలిగితే మాత్రం వెల్లంపల్లికి మంత్రి పదవి పోవటం ఖాయం.