మనలో చాలామంది దేవుడిని ఎంతో భక్తితో పూజిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించడం పూజలో ఎంతో ముఖ్యమైనదనే సంగతి తెలిసిందే. భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల దేవుడి అనుగ్రహం కలిగే అవకాశం అయితే ఉంటుంది. దేవుడిని పూజించడం ద్వారా భక్తులకు సంతోషంతో పాటు శ్రేయస్సు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే దేవుడికి నైవేద్యం సమర్పించే వాళ్లు కొన్ని నియమాలను పాటించాలి.
నిబంధనలు పాటించకుంటే ఇంట్లో కష్టాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రంలో దేవుడికి నివేదించిన ఆహారపదార్థాలను నైవేద్యం అని చెబుతారు. దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసాదం విషయంలో తప్పులు చేస్తే కొన్నిసార్లు వాళ్లకు దురదృష్టం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
దేవుడికి నివేదించిన పదార్థాలను మనం తినకూడదని కూడా ధర్మ శాస్త్రాలు చెబుతుండటం గమనార్హం. దైవారాధనలో ప్రత్యేకంగా భగవంతుడికి నైవేద్యం పెట్టడమే కాకుండా, వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామంది అలవాటుగా పెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే ప్రతికూల శక్తుల వల్ల చెడు జరుగుతుంది.
ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవడం లేదా 10 మందికి పంచడం చేస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు మరియు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనికరిస్తాడని చెప్పవచ్చు. ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని పండితులు చెబుతున్నారు.