ఇంట్లో మట్టి కుండను ఏర్పాటు చేశారా… అయితే ఏ దిక్కున పెట్టాలో తెలుసా?

ఒకప్పుడు ఇంటిలో నీటిని నిలువ చేసుకోవాలంటే ఎక్కువగా మట్టి కుండలను ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం ఈ కాలంలో మట్టికుండలు కనిపించడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో రిఫ్రిజిరేటర్ లో ఉండటం వలన మట్టి కుండలు కరవై పోయాయి. అయితే మట్టి కుండలో నీటిని తాగడం ఎంతో ఆరోగ్యం. అయితే ఇప్పటికీ కొందరి ఇంటిలో ఇలాంటి మట్టి కుండలను ఉపయోగించి మంచి నీటిని భద్రపరుచుకుని అదే నీటిని తాగుతూ ఉంటారు.ఈ విధంగా మట్టికుండను ఉపయోగించే వారు దానిని ఏ దిశలో పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం మట్టికుండను ఇంటిలోకి తెచ్చిన తర్వాత అందులో నీటిని నింపి ఒక చిన్న పిల్లకు ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. అలాగే మట్టి కుండలో నీటిని తాగటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఇకపోతే మట్టికుండలో ఏర్పాటు చేసిన నీటిని ఏ దిశ వైపు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది అనే విషయానికి వస్తే…

మట్టి కుండలో నీటిని నిల్వచేసి కుబేరుడి స్థానం అయిన ఉత్తర దిశవైపు పెట్టడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మట్టికుండను నిల్వ చేయడానికి ఉత్తరదిశ ఎంతో అనుకూలమైనది. ఈ దిశలో నీటిని నిల్వ చేయటం వల్ల కుబేరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఏ విధమైనటువంటి డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.