Vastu Tips:సాధారణంగా పెద్దవాళ్ళు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనే విషయాల గురించి మనకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే పెద్దవాళ్ళు చెప్పిన విధంగా మనం వ్యవహరించడం ఎంతో మంచిది.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇతరులకు సంబంధించిన కొన్ని వస్తువులను మనం ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఇతరులకు సంబంధించిన ఏ వస్తువులను మనం ఉపయోగించకూడదు ఇక్కడ తెలుసుకుందాం…
రుమాలు: వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరు ఉపయోగించిన రుమాలు మరొకరు ఉపయోగించడం వల్ల వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి బీటలు బారుతాయి.
గడియారం:ఒక చేతి గడియారం మరొకరు కట్టుకోవడం పూర్తిగా అశుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. గడియారానికి ప్రతికూల, అనుకూలశక్తులతో అనుసంధానమై ఉంటుంది కనుక ఒకరి మణికట్టుపై ఉన్న వాచీ మరొకరు కట్టుకోవడం వల్ల వారికి చెడుకాలం ప్రారంభమైందని అర్థం.
ఉంగరం: వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి ఉంగరం మరొకరు ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
పెన్ను: వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి పెన్ మరొకరు వాడడం పూర్తిగా శుభం. ఇలా ఉపయోగించడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బును కోల్పోవలసి వస్తుంది.