Vastu Tips: చాలామంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధా ను వాస్తు ప్రకారం వినియోగించుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారంగా ఈ లాఫింగ్ బుద్దాను ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో పెట్టుకోవడం వల్ల జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్ గ్రంధం అయిన ఫెంగ్ షుయ్ లో ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది. వాస్తు ప్రకారం గా లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో ఉంచడాన్ని శుభ ప్రదంగా పరిగణించడం పాటు, లాఫింగ్ బుద్ధాను వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం ద్వారా సంపద శ్రేయస్సు లభిస్తుంది.
అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి లాఫింగ్ బుద్ధ సహాయం చేస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. మరి ఇంట్లో లాఫింగ్ బుద్ధ ను ఏ దిశలో పెట్టాలి. ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మనకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అనేక రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే.. డబ్బులు మోసే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం. అలాగే ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని నమ్మకం.
అదేవిధంగా భూమి నుంచి 30 అంగుళాలు లేదా గరిష్టంగా 32 అంగుళాల ఎత్తులో విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి డబ్బులు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక లాఫింగ్ బుద్ధను ఏయే ప్రదేశాలలో పెట్టకూడదు అన్న విషయానికి వస్తే వంట గదిలో, భోజనం తినే ఏరియాలో, పడక గదిలో, టాయిలెట్ లో ఈ లాఫింగ్ బుద్ధ అస్సలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.