Vastu Tips:సాధారణంగా మన ఇంట్లో మనకెంతో ఇష్టమైన కుటుంబ సభ్యులు చనిపోతే వారి ప్రేమకు గుర్తుగా వారి జ్ఞాపకాలను ఎంతో భద్రపరుచుకుంటాము. ఇలా చాలా మంది చనిపోయిన వారి ఫోటోలను వారి గుర్తుగా ఇంట్లో వేలాడదీయడం మనం చూస్తూ ఉంటాము.ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలకు రోజు పూలు పెడుతూ వారి ఫోటో ముందు దీపం వెలిగిస్తూ వారి ప్రేమను చాటుకుంటారు.అయితే ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశంలో పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము.నిజానికి ఇలా చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
మరి చనిపోయిన వారి ఫోటోలు ఏ దిశలో ఉంచాలి ఎలా ఉంచడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడు మనం హాల్లోనే వేలాడదీయాలి. పొరపాటున కూడా వీరి ఫోటోలను పడకగది లేదా దేవుడి గదిలో ఉంచకూడదు. పడకగదిలో ఉంచడం వల్ల మన ఇల్లు మొత్తం నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా దేవుడి గదిలో ఉంచడం వల్ల దైవాగ్రహానికి బలి కావలసి వస్తుంది.
అందుకే చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడు హాల్లో వేలాడదీయాలి. ముఖ్యంగా హాల్ లో దక్షిణదిశ గోడకు చనిపోయిన వారి ఫోటోలను వేలాడదీయడం ఎంతో మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ గోడకు వారి ఫోటోలను వేలాడదీస్తే వాళ్ళు ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉంటుంది.ఇలా ఉత్తర దిశ వైపు చూసే విధంగా దక్షిణ దిశకు ఫోటోలను వేలాడదీయడం వల్ల ఇంట్లో మంచి వాతావరణ పరిస్థితులు ఏర్పడటమే కాకుండా మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.