త్వరలో పెళ్లి కొడుకు కానున్న వరుణ్ తేజ్

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో వరుణ్ తేజ్ కూడా ఒకడు.సాధనంగా వివాదాలకు దూరంగా ఉండే వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే ఆ హీరోయిన్ తో తిరగడం మానెయ్యమని తన తండ్రి నాగ బాబు వారించాడని కూడా తెలిసింది.

అయితే తాజా గా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే వరుణ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడంట. ఈ ఏడాది నవంబర్ లో హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే పెళ్లికూతురు ఎవరో కాదు ఒక ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తోంది.

అయితే ఇంకా తమ్ముడు వరుణ్ తేజ్ టాలీవుడ్ కి చెందిన హీరోయిన్ ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించగా అవన్నీ కూడా ఒట్టి పుకార్లే అంటూ స్పందించిన విషయం తెలిసిందే. మరి ఈ వార్తలు నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.