బన్నీపై ప్రశంసల వర్షం.. వరుణ్ సందేశ్, వితికా ట్వీట్స్ వైరల్

varun Sandesh and Vithika sheru about Allu Arjun For secret santa

క్రిస్మస్ సందర్భంగా సీక్రెట్ సాంటా మిషన్‌లో భాగంగా వితిక, నోయల్ వంటివారు ఓ అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ చిన్న పిల్లల కోరికలను తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నంచారు. అందులో ఓ బుల్లి అభిమాని మాత్రం ఒకే ఒక్క కోరికను కోరాడు. అల్లు అర్జున్ ఆటో గ్రాఫ్ కావాలని కోరారు. ఇక బాలుడి కోరికను తీర్చే క్రమంలో నోయల్, వితిక ఈ సందేశాన్ని అల్లు అర్జున్‌కు చేరవేశారు. మొత్తానికి బన్నీ కూడా రియాక్ట్ అయ్యాడు.

varun Sandesh and Vithika sheru about Allu Arjun For secret santa
varun Sandesh and Vithika sheru about Allu Arjun For secret santa

అల్లు అయాన్ చేత తన ఆటోగ్రాఫ్‌ను ఇచ్చి పంపించాడు. ఇలా బన్నీ తన బుల్లి అభిమాని కోరికను తీర్చడమే కాకుండా అయాన్‌ను కూడా పంపించడంతో వితిక థ్యాంక్స్ చెప్పింది. ఈ మేరకు వితిక, వరుణ్ సందేశ్ చేసిన ట్వీట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ చిన్న పిల్లాడి కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు అల్లు అర్జున్ గారు.. ధన్యవాదాలంటూ వితిక ట్వీట్ చేసింది. రియల్ సాంటాగా మీరు మారి ఇలా కలను నిజం చేశారంటూ ప్రశసంలు కురిపించింది.

మీ అభిమానులకు మీరెప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గానే ఉన్నారు.. అభిమానులపై ఈ మీ దయాగుణం.. ప్రేమకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదంటూ ట్వీట్ చేపింది. ఇక వరుణ్ సందేశ్ కూడా రియాక్ట్ అవుతూ.. మీ శ్రేయోభిలాషులకు, మీ అభిమానుల కోసం మీరు చేసే ప్రతీ పని ఎంతో గర్వంగా, ఎంతో హుందాగా, ఎంతో అణుకువగా ఉంటుంది. దయా హృదయం గల మంచి మనిషి సర్ మీరు.. మీకు ఎల్లప్పుడూ సుఖసంతోషలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ వరుణ్ సందేశ్ ట్వీట్ చేశాడు.