బుల్లితెర మీద ప్రసారమౌతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి వారిలో ఇమాన్యుల్, వర్ష కూడా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ స్టేజ్ మీద వీరిద్దరి మద్య జరిగే కెమిస్ట్రీ కారణంగా వీరిద్దరూ మరింత ఫేమస్ అయ్యారు. ఇలా జబర్దస్త్ బాగా పాపులర్ అయిన జంటల్లో సుధీర్ రష్మి జంట కూడా ఒకటి ప్రేక్షకులను అలరించడానికి వీరు ఆన్ స్క్రీన్ మీద ప్రేమికులుగా నటించటం వల్ల నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అంటూ తరచు రష్మి క్లారిటీ ఇస్తూ ఉంది.
ఇక వర్ష, ఇమ్మానియేల్ కూడా లవ్ ట్రాక్ వల్ల బాగా ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ లో వీరిద్దరి మద్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. బుల్లితెర మీద ప్రసారమౌతున్న పలు కార్యక్రమాలలో వీరిద్దరూ కలిసి చేస్తే పనుల వల్ల కూడా ప్రేక్షకులలో ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. జబర్దస్త్ లో ఏకంగా వీరిద్దకి పెళ్ళి కూడా జరిపించారు. ఇటీవల వర్ష ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తనకి, ఇమ్మానియేల్ మద్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యింది.
ఈ సంధర్భంగా వర్ష మాట్లాడుతూ…” ఇమాన్యుయేల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువ. తను నన్ను ఎంతో అభిమానిస్తాడు. ఇమాన్యుయేల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా ఇద్దరి మద్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది మాత్రం నేను చెప్పలేకపోతున్నా. స్కిట్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా బయట కూడా మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాగే ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా ఇమాన్యుయేల్ తో రిలేషన్ ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను” అంటూ ఇమాన్యుయేల్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి వర్ష బయటపెట్టింది. దీంతో వీరిద్దరూ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారు అనే విషయంపై ప్రేక్షకులకి ఒక క్లారిటీ వచ్చింది.